Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'వీడు డైరెక్టర్ ఏంట్రా?' అని రవిబాబును తిట్టిన బంటీ... అదిరిపోయిన 'అదుగో' టీజర్ వీడియో!

  • పందిపిల్ల ముఖ్యపాత్రలో రవిబాబు దర్శకత్వంలో చిత్రం
  • టీజర్ లో ఒకరిని ఒకరు టీజ్ చేసుకున్న బంటి, రవి
  • అలరిస్తున్న 'అదుగో' చిత్రం టీజర్
బంటి అనే ఓ చిన్న పందిపిల్ల ముఖ్య పాత్రలో రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'అదుగో' టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలై చూసిన ప్రతి ఒక్కరినీ అలరించింది. రవిబాబు బంటి గురించి పరిచయం చేస్తూ గొప్పగా చెబుతుంటే, బంటి మాత్రం రవిబాబును ఫన్నీగా తిడుతోంది. ఈ టీజర్ లో బంటీ అని పిలవగానే టేబుల్ పైకెక్కిన ఆరు నెలల పంది పిల్లను కెమెరా వైపు చూడమని చెప్పగానే అది చూడటం, దీనికి చిలగడ దుంపలు అంటే ఇష్టమని రవిబాబు చెబితే, "కానీ నాకెప్పుడూ పెట్టడు. అన్నీ వీడే తినేస్తుంటాడు" అని బంటీ ఆరోపించడం కనిపిస్తుంది.

ఆపై పెద్ద అల్లరోడని, చూడటానికి ఇంతే ఉన్నా బుర్ర చాలా పెద్దదని రవిబాబు చెబితే, "వీడు చూడటానికి అంతున్నా బుర్ర మాత్రం అసలు లేదు" అంటుంది. వీడిని మెయిన్ క్యారెక్టర్ గా పెట్టి ఓ సినిమా తీస్తున్నానని, దాని కథేంటంటే... అని రవిబాబు చెప్పగానే, "ఓ పందిపిల్ల, ఓ కోడిపెట్ట ప్రేమించుకున్నాయి...." అని బంటి చెప్పుకుంటూ పోయింది. వీడు సినిమాలో చాలా బాగా చేశాడని రవి చెబితే, "వీడు మాత్రం డైరెక్షన్ చాలా నీచంగా చేశాడు" అని తిట్టేస్తుంది.

సినిమాలో కూడా వీడు ఇంతే, పెద్ద తేడా క్యారెక్టరని రవి అంటే, "క్యారెక్టర్ ఏంట్రా క్యారెక్టర్ హీరో అని చెప్పు" అని గద్దిస్తుంది. నువ్వు హీరో అని చెబితే అక్కడ జనం సినిమాకు రావద్దూ అని అడిగితే, "హీరోను చూసేరా సినిమాకు వచ్చేది. నువ్వు డైరెక్టర్ ఏంట్రా బాబూ... మా ఖర్మ కాకపోతే" అని తిట్టేసింది. ఈ టీజర్ ను చూసి ఎంజాయ్ చేయండి మరి!
adigo
pig
ravibabu
banti

More Telugu News